

నేటిసాక్షి, అక్కన్నపేట:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా అక్కన్నపేట మండలంలోని కట్కూరు, చాపదని తండా, జనగాం గుబ్బడి, మోత్కుపల్లి, పెద్ద తండా, కపూర్ నాయక్ తండా, ధర్మరాం గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలో అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ … తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరియు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డు గత ప్రభుత్వ హయాంలో ఇవ్వనటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు మరియు గత ప్రభుత్వ హయాంలో మీ సేవ కేంద్రాలలో పెట్టుకున్నటువంటి రేషన్ కార్డులో పేర్ల తొలగింపు మరియు పేర్ల జమచేయుట వంటి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. గ్రామ సభలలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రాణి వరు ఎవరైనా ఉంటే మరల గ్రామసభలలో అప్లై చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు పేర్ల మార్పు చేర్పులు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది, సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా వస్తున్నటువంటి వార్తలు ఎవరు పట్టించుకోవద్దు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు తప్పకుండా ఈ ప్రభుత్వం అందిస్తుంది అర్హులందరికీ అన్ని పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో అనంతరెడ్డి, ఎంపీడీవో జయరాం, అగ్రికల్చర్ ఏవో తస్లీమా సుల్తానా, ఎంపీఓ మోహన్ నాయక్, ఆర్ఐ యాదగిరి మరియు వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, హుస్నాబాద్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గడి ఐలయ్య, AMC డైరెక్టర్ బైకానీ శ్రీనివాస్, భాస్కర్ నాయక్, కొలిపాక అశోక్, సారయ్య, గంపల శ్రీనివాస్, లింగంపల్లి సారయ్య, మంద పరశురాము, రాకేష్, నాగరాజ్, శ్రీనివాస్ వివిధ గ్రామాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






