నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్టు వ్యవహరించారు. పై అధికారులు వచ్చినా కూడా పట్టించుకోని నైజం,విధుల పట్ల నిర్లక్ష్యం అధికార దుర్వినియోగం ,అవినీతికి పాల్పడ్డ నన్నెవరు ఏమి చేయలేరు అన్న ధీమా! ఈమెనే జోగులాంబ గద్వాల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న గట్టు మండల తాసిల్దార్ సరిత రాణి. అసలు ఈమె కు ఇంతటి తెగింపు ఎక్కడినుండి వస్తుంది అన్నది నేటికీ ప్రశ్నార్థకమే కానీ! కొందరు నేతల అండదండతో అడ్డగోలుగా ప్రజలను దోచుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కొలువు చేస్తూ.. అడ్డంగా దోచుకునే అలవాటు ఆమెది. అన్ని కరెక్ట్ ఉన్న ఏదో ఒక సాకుతో జనాలను దోచుకున్నట్టు ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం కొందరు ఈమె చేసిన అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినా కలెక్టర్ స్పందించకపోవడంతో వారు కొంత నిరాశకు గురైనప్పటికీ ఎట్టకేలకు కలెక్టర్ స్పందించి ఆమెను సస్పెండ్ చేయడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారు నాదో చిన్న విన్నపం… జిల్లాలో ఉన్న అన్ని తాసిల్దార్ కార్యాలయంలో చిన్న ఉద్యోగి నుండి పై స్థాయి ఉద్యోగుల వరకు ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఇది నగ్న సత్యం, అయితే ఎమ్మార్వో కు ముట్టాల్సింది సపరేటు, ఎమ్మార్వో ఈ వ్యవహారాన్ని సంబంధిత మీసేవ నిర్వాహకులతో సాగిస్తున్నట్టు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్లకు వచ్చిన వ్యక్తులతో మీ సేవ నిర్వాహకులు ఏదో సాకు చూపించి అధిక డబ్బులు వసూలు చేస్తూ.. అధికంగా వసూలైన కొద్ది మొత్తాన్ని ఎమ్మార్వో కు సాయంకాల వేళలో అందిస్తున్నట్టు సమాచారం, మొదటిగా మీసేవ నిర్వాహకులపై తమరు దృష్టిసారించినట్టు అయితే ఇలాంటి అక్రమాలను నిలుపుదల చేసి అవకాశం ఉంటుందని ప్రజలుకొరుతునారు.




