- ఉన్న వారికే కానీ లేనివారికి న్యాయం జరగట్లేదని ప్రశ్నించిన గ్రామ ప్రజలు
- అందరికీ న్యాయం జరిగేలాగా కృషి చేస్తామన్న జిల్లా అధికారి శ్రీనివాసరావు
- గందరగోళంగా మారిన గ్రామసభలు
- అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేసిన ప్రజలు


నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి, సతీష్ నాయక్ : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలు రసాభాసగా మారాయి.ఈ సందర్భంగా గ్రామసభలో గతంలో సంక్షేమ పథకాలకు అప్లై చేసుకున్న లబ్దిదారుల లిస్ట్ ను అధికారులు గ్రామస్తులకు చదివి వినిపించారు.దీంతో గ్రామస్తులు తమ పేర్లు రాలేదని అనర్హుల పేర్లు వచ్చాయని, భూస్వాములకే, ధనవంతులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి పేర్లు వస్తున్నాయని అధికారులను ప్రశ్నించడంతో గందరగోళం నెలకొన్నది.దీంతో అధికారులు అర్హులు ఎవరైనా ఉంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆ గ్రామ నాయకులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.అయినా వినకుండా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.ఈ కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, తహశిల్దార్ హిమబిందు,ఎంపీడీవో షేక్ సుష్మా,ఏవో సతీష్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





