- జగిత్యాల, రాయికల్ ప్రధాన రహదారిపై బైఠాయింపు
- ఫోలీసులు, ట్రాన్స్‌కో అధికారుల హామితో ఆందోళన విరమణ
నేటిసాక్షి, రాయికల్: ఇండ్లపై నుండి 132 కెవి కరంటు వైర్లను వేయవద్దంటూ రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. జగిత్యాల, రాయికల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. స్థానిక సబ్‌స్టేషన్ నుండి 132 కెవి విద్యుత్ వైర్లను పూరి బయట నుండి వేయాలని ఇది వరకే అధికారులకు చెప్పామని గ్రామస్తులు తెలిపారు. తమ నివాస గృహల పై నుండి విద్యుత్ వైర్లను వేస్తే తమకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని తక్షణం విద్యుత్ వైర్ల పనులను నిలిపి వేయాలని డిమాండ్ చేసారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధీర్‌రావు, ట్రాన్స్‌కో ఎఇ నవీన్‌లు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. 132 కెవి లైన్ వల్ల ఏలాంటి ఇబ్బంది ఉండదని గ్రామస్తులకు నచ్చజెప్పారు. మరో విద్యుత్ లైన్‌ను వేరే ప్రాంతం నుండి వేస్తామని చెప్పి ఆందోళన విరమింపజేసారు. బాధితుల ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడంతో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.




