- శ్రీ రంగనాయక స్వామి జాతర సందర్భంగా ఎస్పిఎల్ -14 ప్రీమియర్ లీగ్ లో టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు
- ఏఐపీసీ హెల్త్ కేర్ నేషనల్ చైర్మన్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శ్రీరంగాపూరం మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ రంగనాయక స్వామి జాతర సందర్భంగా ఆదిత్య రెడ్డి శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరంగాపురం మండల్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రంగనాథుని మొక్కుకున్నారు. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీరంగాపూర్ ప్రీమియర్ లీగ్ లో -14 ఈరోజు క్రీడాకారుల ఆహ్వానం మేరకు క్రికెట్ ప్రాంగణానికి విచ్చేసిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి కి ఘనంగా సన్మానించి క్రీడాకారులతో కాసేపు క్రికెట్ ఆడడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులతో మానసిక భౌతిక నైపుణ్యం అభివృద్ధి జరుగుతుందని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావానికి తోడ్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం టౌన్ అధ్యక్షుడు గోవింద్.వనపర్తి జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ కన్వీనర్ యస్ పురుషోత్తం యాదవ్, వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దేవన యాదవ్, ఐఎన్టియూసి వనపర్తి జిల్లా అధ్యక్షుడు గంగు మాధవరెడ్డి, శ్రీరంగాపురం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, పెబ్బేరు నాయకులు మహేష్ కుమార్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, పెబ్బేర్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నాయుడు, శ్రీరంగాపురం సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోప్పరి రమేష్ , పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, ఖిల్లా గణపురం సోషల్ మీడియా కోఆర్డినేటర్ అజీమ్, శ్రీరంగాపూర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అజీమ్, ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





