నేటి సాక్షి-హుజురాబాద్: జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం ల కేసు హైకోర్టులో వాదించి గెలిపించిన టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది జీడీ రవి తేజ ను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జీడి రవితేజ పనిచేయాలని సూచించారు. హైకోర్టులో కేసు గెలవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొలుగురు కిరణ్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్, జాను, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.





