- జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ పార్టీ
నేటి సాక్షి, కమలాపూర్:
హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితెల ప్రణవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరే వాళ్ళు జర్నలిస్ట్ లని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని రిపోర్టర్స్ కి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్బంగా ఆయన అన్నారు. అలాగే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పాత్రికేయ, ఎలక్ట్రానిక్ విలేకరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని వోడితెల ప్రణవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డా. గుండపు చరణ పటేల్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డా. మౌటం కుమారస్వామీ, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, కమలాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పెర్క రమాకాంత్, ఉపాధ్యక్షులు పుల్ల రాజేష్, జిల్లా కార్యదర్శి వెంగళ విజయ్, మండల ప్రధాన కార్యదర్శి పెండెం రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి ఎండి సందాని, సంయుక్త కార్యదర్శి పుల్ల సందీప్, కార్యవర్గ సభ్యులు డాకూరి రాజశేఖర్, కొలుగూరి లక్ష్మణ్, కిన్నెర వేణు తదితరులు పాల్గొన్నారు.

