Sunday, March 15, 2026

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

  • పాస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్

నేటి సాక్షి-హన్మకొండ: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని పూలే ఆశయ సాధన సమితి (పాస్ ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహనా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద వివక్ష లేకుండా అక్షరాస్యులకు, నిరక్షరాశులకు సమానంగా సార్వత్రిక వయోజన ఓటు కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే రాజులు, రాణులు అని కొనియాడారు. ప్రాథమిక బాధ్యతగా ప్రతి దేశ పౌరుడు ఓటు నమోదు చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంటుందన్నారు. రాజ్యాంగం కల్పించిన ఒక ఓటు అనే ఆయుధం విలువ తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ, అవినీతిని పారదోలే వజ్రాయుధం ఒక ఓటు మాత్రమేనని, ఓటు నమోదు పెరుగుతున్నప్పటికీ ఓటింగ్ శాతం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ వంగల సుధాకర్, పాస్ నాయకులు డాక్టర్ కొట్టే భాస్కర్, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, మోటె చిరంజీవి, విద్యార్థిని, విద్యార్థులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News