నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): వెల్గటూర్ మండలంలోని కిషన్రావుపేట గ్రామానికి చెందిన గౌరు అంకిత్ తండ్రి చంద్రయ్య (20) అనే యువకుడు కడు దీనస్థితిలో ఉండి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతడి తల్లిదండ్రులు 15 సంవత్సరాల క్రితం మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో రోజు వారి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంతలో విధి వైపరీత్యం వల్ల గత మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగగా దాతల సహాయంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకొని కూలి పని చేసుకుంటున్నాడు. కానీ గత నాలుగు, ఐదు రోజుల క్రితం అదే కాలు ఇన్ఫెక్షన్ అవడంతో ప్రస్తుతం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో అడ్మిట్ అయ్యాడు. కాగా చికిత్స కోసం అక్కడి డాక్టర్ లు లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇందుకు డబ్బులు లేకా ఆర్థిక ఇబ్బందితో ట్రీట్మెంట్ చేసుకోలేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఈ నెంబర్లకు 7981319649, 9652373734 ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు.

