
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి పట్టణంలో రెస్టారెంట్ ఓనర్ ఏ రఘునందన్ గౌడ్ ఆహ్వానం మేరకు నూతన అమృతం రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. గురువారం రోజు మర్రికుంట దగ్గర నూతన అమృతం రెస్టారెంట్ ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే. రెస్టారెంట్ లో నాణ్యమైన మంచి రుచికరమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు అమృతం రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్‌ను విభిన్న ఆహార రుచులను అందించేందుకు వనపర్తి కేరాఫ్‌గా నిలుస్తుందన్నారు. రెస్టారెంట్ లో మటన్, చికెన్ చాలా ఇష్టమని భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు,చీర్ల సత్యం సాగర్, నక్క రాములు, లక్ష్మీ రవి యాదవ్, చంద్రకళ ఎల్ఐసి కృష్ణ,సత్యమ్మ శరవంద, భువనేశ్వరి శ్యామ్, జంపన్న, వినోద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి, టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గంధం కృష్ణ బాబు, ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సూరి వెంటూరు శ్రీనివాస్ రెడ్డి, రఘుపతిరావు, మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ కాన్, మాజీ కౌన్సిలర్ చుక్క రాజు, ఉమ్మల రాములు, చీర్ల అంజి,చీర్ల జనార్దన్, చీర్ల నాగరాజు, రంజిత్, రఘు యాదవ్, తిరుపతయ్య, వసీం, ఇర్ఫాన్, జాంగిర్, అస్లాం, ఖాజా, బాబా, బషీర్, హమీద్, మోహన్ రాజ్, భాస్కర్, చుక్కయ్య శెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





