Sunday, March 15, 2026

రైల్వే జీఎం ను కలిసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కాజీపేట బస్ స్టాండ్ ఏర్పాటు మరియు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేలు రైల్వేస్టేషన్ నుండి బోడగుట్ట వైపున ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మరియు రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు అండర్ బ్రిడ్జిని మంజూరు చేయాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ జీఎం అరుణ్ కుమార్ జైన్, డిజియం ఉదయ్ నాథ్కోట్ల తో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ శాసన సభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, సమావేశం అయ్యారు. ఖాజీపేట రైల్వే డివిజన్ మరియు కాజీపేట ఆవరణలో నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ప్రజా రవాణా దృష్ట ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండ్ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కాజీపేట విస్తృతమైన రైల్వే కనెక్షన్‌ల తో కీలకమైన జంక్షన్, కాజీపేట అని పేర్కొన్నారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని తెలిపారు. రైలు ప్రయాణాల తర్వాత వారి స్వస్థలాలకు చేరుకోవడానికి ఆర్ టీ సీ బస్సులపై ఆధార పడతారని, ఈ బస్టాండ్ వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు చిన్న తరహా పరిశ్రమల వారి రోజువారీ ప్రయాణానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. కాజీపేట ప్రధాన రహదారి వెంట ఉన్న రైల్వే స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. బోడ గుట్ట ప్రాంతానికి దాదాపు ఒక కి.మీ దూరంలో ఉన్న ప్రసిద్ధ దర్గా “హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబనీ ఉందని తెలిపారు. భారతదేశం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ దర్గాను సందర్శిస్తారని తెలియజేసారు. రైల్వేస్టేషన్ నుండి బోడ గుట్ట వైపున ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మరియు రైల్వే సమీపంలోని రోడ్డు అండర్ బ్రిడ్జిని మంజూరు చేయాలని రెల్వే జీఎం ని అభ్యర్ధించారు. కాజిపేట ప్రజల కోరిక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ సందర్భంగా పై అంశాలపై జీఎం అరుణ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందింస్తూ కాజీపేట లో బస్టాండ్ నిర్మాణానికి స్థల కేటాయింపు విషయాన్నీ పరిశీలిస్తానని, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అతి త్వరలో మంజూరు చేసేందుకు కృషి చెస్తానని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News