- గంజాయి సేవించిన, విక్రయించిన, రవాణా చేసిన కఠిన చర్యలు..
- గంజాయి నిందితులు నేర ప్రవర్తి మార్చుకోవాలి…
- చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు..
నేటిసాక్షి ప్రతినిధి,చందుర్తి (సతీష్):
గతంలో గంజాయి కేసులలో పట్టుబడిన వారికి బుధవారం చందుర్తి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
సర్కిల్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో ఉన్న పాత నెరస్థులపై పోలీస్ నిఘా ఎప్పుడు ఉంటుందని, వారు తమ తమ నెరప్రవృతిని మార్చుకొని సత్ప్రవర్తనతో మేలగాలని లేనియెడల హిస్టరీ షీట్స్, పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో జిల్లా ఎస్పీ నేతృత్వంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని,గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తున్నామని, గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామని తెలిపారు. ఈ కౌన్సిలింగ్ లో స్థానిక ఎస్సై అంజయ్య, అశోక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.





