నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హైవేపై మరియు రాజారాంపల్లి నుంచి జగిత్యాలకి వెళ్లే రోడ్డుపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అశోక్ కుమార్ ఎస్పీ ఆదేశాల మేరకు జగిత్యాల డిఎస్పి డి రఘుచందర్ సూచనలతో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రదేశంలో వాహనదారులను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక బోర్డులను గతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలను గుర్తించి ఇకపై అట్టి ప్రదేశాలలో ప్రమాదం జరగకుండా ఉండడానికి తగు హెచ్చరిక సూచికలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమర్చడం జరిగింది. వాహనదారులు రోడ్డుపై తమ వాహనాలు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ మరియు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. ఎట్టి పరిస్థితులను మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు వారు కారణం కాకూడదు. ఇట్టి కార్యక్రమంలో సిఐ ధర్మపురి.రామ్ నర్సింహారెడ్డి మరియు ఎస్సై వెల్గటూర్ ఆర్. ఉమాసాగర్, కానిస్టేబుల్ ఆదిల్ మరియు రాజేష్ పాల్గొన్నారు.





