నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని ఖాన్ పుర ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలకు ఏఐఎంఐఎం 31వ డివిజన్ యువ నాయకుడు షేక్ యెస్దాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వాటర్కూలర్ను బహూకరించారు. ఈ సందర్భంగా యెస్దానిని హెచ్ఎంహెచ్ఎం సయ్యద్ ముతహరుద్దీన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్అధ్యక్షుడు సర్వర్షా బియాబని, అబ్దుల్ కరీం, సమీర్, సయ్యద్ ఇమ్రాన్, ముఫసిల్ తవక్కల్, డివిజన్ యువకులు, నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







