- ఇరిగేషన్ అధికారిని శారద కు వినతి పత్రం
- బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
నేటి సాక్షి, మందమర్రి:- మండలంలోని అదిల్ పెట్ గ్రామ పంచాయితి పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసిన భూమి హద్దులు గుర్తించి, ట్రెంచ్ ఏర్పాటు చేసి చెరువు ఆయకట్టు రైతులకు నీరు అందేలా చెయ్యాలని బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజక వర్గ అధ్యక్షులు మల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీర్ శారద కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాల క్రితం చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యవసాయ భూములు సంబంధిత శాఖా స్వాధీనం చేసుకోకపోవడంతో రైతుల ఆధీనంలోనే వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం ఉందని, వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన భూములు రికార్డుల నుండి తొలగించి సంబంధిత శాఖా స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన భూములకు హద్దులు గుర్తించి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని, చెరువు పూడిక తీసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ రైతులకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు సింగతి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.





