- ఎస్సారెస్పీ ఈఈ కార్యాలయంలో ప్రజాసంఘాల వినతి
నేటి సాక్షి, మంథని (పెయ్యల రమేష్): గుండారం రిజర్వాయర్ నుండి యాసంగి పంటకు వెంటనే నీటి విడుదల చేయాలని ఎస్సారెస్పీ ఈ కార్యాలయం లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.మంథని ప్రాంతం వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది వ్యవసాయాన్ని నమ్ముకోని రైతులు యాసంగి పంటను మొదలుపెట్టారని ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేయకుంటే రైతులు పంట నష్టపోయే అవకాశం ఉన్నందున గుండారం రిజర్వార్ నుండి వెంటనే నీటిని విడుదల చేయాలని ఈ వినతి పత్రం లో తెలియజేయడం జరిగింది. యాసంగి పంట సీజన్ ప్రారంభం అయింది కాబట్టి సంబంధిత అధికారులు నీటి విడుదలపై దృష్టి సారించి మంథనిలో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులకు నీటిని అందించాలని ఇట్టి సమస్యపై రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎసంగి పంట చేతికి వచ్చే విధంగా మంథని ప్రాంతా చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎస్సారెస్పీ ఏఈని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, కెవిపిఎస్ మండల బాధ్యులు మంథని లింగయ్య, వ్య.కా.స జిల్లా ఉపాధ్యక్షుడు బావు రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సురేష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రెంకల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

