Monday, March 16, 2026

మున్సిపల్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలి

నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో మున్సిపల్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఓజ్జల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు పట్టణ మున్సిపల్ కమిషనర్ మోహన్ కు ఆయన శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈనెల 4వ తేదీ వరకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాదని ప్రకటించారని, దీంతో పలు వార్డుల్లో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News