Friday, April 3, 2026

కె యు లో వాటర్ ట్యాంకులు అపరిశుభ్రం

  • ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ లో వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. కనీస నిర్వహణ లేకపోవడం తో అధ్వానంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే ట్యాంక్ లో బల్లి పడటం ఇది తెలియక రెండు రోజుల క్రితం నీళ్లు తాగిన ఇద్దరు పరిశోధక విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు కలుషితమైన నీరు తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని సదర్ వైద్యులు పేర్కొనడం గమనార్హం కేర్ టెకెర్ హాస్టల్ డైరెక్టర్ నిర్లక్ష్యంగా ఉండడం పట్టించు కోకపోవడం వల్లే హాస్టల్ పైన ఓవర్ హెడ్ ట్యాంకులు అపరిశుభ్రంగా మారిపోయాయి. నెలలు, ఏళ్లు గడిచిన ఆ వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్యాంకులు శుభ్రం చేయించి నిర్లక్ష్యంగా ఉన్న కేర్ టేకర్ హాస్టల్ డైరెక్టర్ల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News