Wednesday, March 18, 2026

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం

బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం

నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బీసీ కులగున చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం కుల గణన పూర్తి చేసి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా గన్నేరువరం కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ బీసీ కుల గణన బిల్లుతో రాజకీయ విద్య ఉపాధి రంగాలకు దుహదపడుతుందని ఈ బిల్లు చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. బీసీ కుల గణన పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ కు,బీసీ సెల్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవి,బుర్ర తిరుపతి గౌడ్, దేశ రాజ్ అనిల్,కూన కొమురయ్య,పాకాల పరశురాం,యూత్ ప్రెసిడెంట్ రాపోలు నవీన్, మంగరాపు అనిల్, పెంకర్ల ప్రశాంత్, ముక్కెర అభిలాష్ హరీష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News