Wednesday, March 18, 2026

తొక్కిస‌లాట బాధితులను అన్ని విధాలా ఆదుకున్నాం

  • ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) తిరుప‌తి : వైకుంఠ ఏకాద‌శి టిక్కెట్ల కోసం జ‌రిగిన తొక్కిస‌లాట‌లో క్ష‌త‌గాత్రుల‌కు ప‌రిహారం సోమ‌వారం ఉద‌యం బ‌ర్డ్ ఆస్ప‌త్రిలో చెక్క్ ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అందించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ టిటిడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని రాజేశ్వ‌రికి ఐదు ల‌క్ష‌ల రూపాయలు, గాయ‌ప‌డ్డ కృష్ణ‌మ్మ‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్క్ ను ఆయ‌న‌ అందించారు. క్ష‌త‌గాత్రులు పూర్తిగా కోలుకునే వ‌ర‌కు వైద్యం టిటిడి, ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. తొక్కిస‌లాట‌లో మృతి చెందిన వారికి 25ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారం, తీవ్రంగా గాయ‌ప‌డిన వార‌కి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు, గాయ‌ప‌డ్డ‌వారికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌రిహారం అందించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డ్ మెంబ‌ర్ భానుప్ర‌కాష్ రెడ్డి, ఏపి అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ ఇన్ప్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పోరేష‌న్ డైరక్ట‌ర్ వూకా విజ‌య్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, టిడిపి పార్ల‌మెంట్ పార్టీ అధ్య‌క్షులు న‌ర‌సింహ యాద‌వ్, బిజేపి జిల్లా అధ్య‌క్షులు సామంచి శ్రీనివాస్, అజ‌య్ కుమార్, పొన‌గంటి భాస్క‌ర్, వ‌ర‌ప్ర‌సాద్, టిడిపి నాయ‌కులు శ్రీధ‌ర్ వ‌ర్మ‌, జ‌న‌సేన నాయ‌కులు రాజా రెడ్డి, ఆకేపాటి సుభాషిణి, బండ్ల ల‌క్ష్మీప‌తి రాయ‌ల్, కెఎంకే లోకేష్, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, వినోద్ రాయ‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News