Saturday, March 21, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..!

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కొక్కుల వంశీ ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రభుత్వ విప్ చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించి పట్టభధ్రుల ఓట్లు అడగాలని సూచించారు.గత ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో అదే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం మనందరం కష్టపడి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి,వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News