- తెలంగాణ బ్రాహ్మణ సేవ సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్. విష్ణుదాస్ గోపాల్ రావు
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇటీవల జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూన్నామని తెలంగాణ బ్రాహ్మణ షేవ సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్. విష్ణుదాస్ గోపాల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారము నాడు మీడియతో మాట్లాడుతూ ఆలయ అర్చకులు భగవంతుని శేవలో సమాజ శ్రేయస్సు కోసం నిత్యం తపిస్తూ ప్రజలు అందరు బాగుండాలని సర్వే జెన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినోభవంతు అని నిత్యం భగవంతుణ్ణి వేడుకునే బ్రాహ్మణుని పై దాడి ఎంతో నీచమైన చర్యగా భావిస్తూ ఈ దాడి జరగటం శోచనియమే కాకుండా దార్మిక సంప్రదాయాలపై జరిగిన దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని బ్రాహ్మణ సమాజానికి హిందూ ధర్మానికి ఆలయ సంప్రదాయాలకు ఇది దుర్మార్గమైన నీచమైన చర్యగా మేము ఈ సంఘటనను తీవ్రగా ఖండిస్తూ సంబంధిత అధికారులు పోలీస్ శాఖ వెంటనే దోసులను దాడికి పాల్పడినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరుగకుండా హిందూ ఆలయ పూజరులకు భద్రత పూర్తి రక్షన కలిపించాలని గోపాల్ రావు కోరారు. ఈ సమావేశములో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అర్చక సంగం అధ్యక్షులు. గంగు ఉపేంద్రశర్మ రాష్ట్ర అధ్యక్షులు, పోచంపల్లి రమణ రావు, రాష్ట్ర కన్వీనర్, పవన్ కుమార్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, సంపత్ కుమార్, ఉపాధ్యాక్సులు, కేబి శర్మ, భాస్కర శర్మ, రాఘవ చార్యులు, ట్రెజరర్ చిట్టంపల్లి ఉపేందర్ రావు, ఇందుర్తి నరేష్ కుమార్, రమేష్ కుమార్ విష్ణుదాస్, శ్రవణ్ విమల్ కుమార్, ఎలాబాక కృష్ణ, అర్చక సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాహుల్ శర్మ జిల్లా కార్యదర్శి, నందకిశోర్ శర్మ, లలిత్ శర్మ, రామకృష్ణ శర్మ, భగవతుల శ్రీకాంత్ శర్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు పెండం రాఘవ రావు, కమలాపురం మండల అధ్యక్షులు విష్ణుదాస్ గిరిదర్ రావు, జిల్లా నాయకులు విష్ణుదాస్, వంశీదర్ రావు, ఇండర్తి జానకి రామయ్య శర్మ, రవీందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.





