Wednesday, March 25, 2026

తీన్మార్ మల్లన్న సస్పెన్స్ ను తీవ్రంగాఖండిస్తున్నాం

  • తెలంగాణ వాడ బలిజ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్

నేటిసాక్షి /వాజేడు : మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఓడ బలిజ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కులగణను కొరకు పోరాడుతూ బీసీల కొరకు అహర్నిశలు ముందుకు వెళుతున్న తీన్మార్ మల్లన్నను ఈ ప్రభుత్వం సస్పెన్షన్ చేయడంపై తెలంగాణ ఒడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులను తొక్కేస్తున్నారని అన్నారు. దానికి ఉదాహరణ తీన్మార్ మల్లన్నను సస్పెన్షన్ చేయడమే అనిఅన్నారు. ఒకవేళ సస్పెన్షన్ చేయాలంటే ముందుగా ప్రభుత్వంపై మరియూ ముఖ్యమంత్రి పైనే విమర్శలు చేసినటువంటి అనేకమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారని,వారిని చేయకుండా బీసీల ఐక్యత కొరకు పోరాడుతున్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం సరికాదని బీసీల కొరకు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న సస్పెన్స్ ఖండిస్తూ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం అంతట బీసీ నాయకులు ముందుకొచ్చి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News