- వరంగల్ పోలీస్ నూతన కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ 24 x 7 ప్రజలకు అందు బాటులో ఉంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్‌కు డిసిపిలు, అదనపు డిసిపిలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. నూతన పోలీస్ కమిషనర్ గా పూర్వ సిపి అంబర్ కిషోర్ ఝా నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అంబర్ కిషోర్ ఝా నూతన పోలీస్ కమిషనర్ పుష్పగుచ్చాలను అంద జేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వంద శాతం శాంతి భద్రతలను కాపాడతామని, ప్రజలకు పోలీసుల పై నమ్మకం కలిగే విధంగా 24 గంటలు ప్రజల కోసం పని చేస్తామని, ప్రధానంగా నేరాల నియంత్రణ తో పాటు, ట్రాఫిక్ క్రమబద్దీ కరణకై కృషి చేస్తామని, ప్రస్తుతం పోలీసులు ఎదుర్కోంటున్న సవాళ్ళు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడి తో పాటు మత్తు పదార్థాలను వినిగయోగించే వారు, విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించ బడుతుందని, ముఖ్యంగా మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి పెట్టడం రాబోవు రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని నూతన పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమీషనర్ సన్‌ప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలుసి పుష్ప గుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసిన వారిలో డీసీపీ లు షేక్ సలీమ, రాజ మహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏ. ఎస్పీ చైతన్య, అదనపు డీసీపీ లు రవి, సురేష్ కుమార్ తో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ చెందిన ఏసిపి లు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు ఇతర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు.



