- రాష్ట్రపతి ద్రౌపది మురుముపై అనుచిత వ్యాఖ్యలు చేసినకాంగ్రెస్పార్టీని బొందపెడతాం
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్లస్టర్ 1, క్లస్టర్ 2 అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, రామిడివీర కర్ణ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ద్రౌపది మురము పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బడంగ్పేట్ సర్కిల్లో సోనియాగాంధీ చిత్రపటాన్ని దహనం చేసిన బిజెపి నాయకులు. ఈసందర్భంగా బడంపేట్ బిజెపి అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది మురము పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బిజెపి పార్టీ సంబంధించిన వ్యక్తులకు కాకుండా సమాజం మీద అవగాహన కలిగిన వ్యక్తులకు మూడు పర్యాయాలు రాష్ట్రపతి పదవి ముస్లిం వ్యక్తి అబ్దుల్ కలాం, దళిత వ్యక్తి రామనాథ్ కోవింద్, గిరిజన మహిళ అయిన ద్రౌపది మురుములను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి వారికి గౌరవ విచ్చి నా పార్టీగా నిరూపించుకుందని తెలిపారు. ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ భారత దేశ సంస్కృతికి తూట్లు పొడిచి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంపన్న వర్గాలకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన మీరు సంపన్న పార్టీగా నిరూపించుకున్నారు. బిజెపి పార్టీ, బిజెపి శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి , సామ సంజీవరెడ్డి, గుర్రం మల్లారెడ్డి, నడిగూడ యాదగిరి, ఏనుగు రాంరెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి,నిమ్మల శ్రీకాంత్ గౌడ్, చెరుకుపల్లి వెంకటరెడ్డి, వేణు గౌడ్, జగదీశ్వర్ రాజు, రేసు నరసింహారెడ్డి, శుర కర్ణ రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, లాలా సందీప్, కుంటి భాస్కర్, ఇల్లెందుల సాయి సంతోష్, అంతడుపుల మహేందర్, గోపాల్, నరేందర్ చారి, దేశపాక జగన్, నరేష్, మహిళా మోర్చా నాయకురాలు పద్మజ, బాలమణి,బంగారురాజ్ కుమార్, శివరాం రెడ్డి, సైదులు, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, భరత్ ముదిరాజ్, మహేందర్, తిరుమలేష్, కిరణ్, సతీష్ నందా, ప్రవీణ్ గౌడ్, రాంబాబు, శేఖర్,తదితర బిజెపి బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.





