Tuesday, March 17, 2026

ప్రతిభ వున్న క్రీడా కారులను ప్రోత్సహిస్తాం

  • వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ క్రీడాకారులకు సూచించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం ముగిసిన రాష్ట్ర స్థాయి పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలను సాధించిన పోలీస్‌ క్రీడాకారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సొమవారం అభినందించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అభినందన సభకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా హజరై పతకాలను సాధించిన పోలీస్‌ క్రీడాకారులను పోలీస్‌ వ్యక్తిగతంగా కలిసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా క్రీడాకారులను ఉద్దేశిస్తూ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. ముందుగా రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రతిభ కనబరిచినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ.. పూర్తి స్థాయిలో క్రీడలకు సమయాన్ని కేటాయించే పోలీస్‌ అధికారులకు పూర్తి స్థాయి సహయ సహకారాలను అందజేయడం జరుగుతుందని ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని రాబోవు జాతీయ స్థాయిలో ఇదే రీతిలో ప్రతిభ కబరుస్తారని సిపి ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి రవి, ఏసిపిలు నాగయ్య, పార్థసారధి, సురేంద్ర, మధుసూధన్‌, అనంతయ్య, ఆర్‌. చంద్రశేఖర్‌, శ్రీనివాస్,శ్రీధర్  పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News