Tuesday, March 10, 2026

సొంతింటి కల నెరవేరేంతవరకు పోరాడుతాం

  • సిఐటియు రాష్ట్ర అద్యక్షుడు తుమ్మల రాజారెడ్డి

నేటి సాక్షి, మంచిర్యాల బ్యూరో:-

సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన సొంతింటి కల నెరవేరేంతవరకు పోరాడుతూనే ఉంటామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలోని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ఆర్పీ 3 గనిలో యూనియన్ ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో గెలిచిన, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి లకు కార్మికులపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కార్మికులకు సొంతింటి కల నెరవేర్చడంతో కార్మికులకు, యాజమాన్యానికి, ప్రభుత్వానికి కలిగే లాభాలను కూలంకుశంగా వివరించారు. గతంలోని కోల్ ఇండియాలో పెర్క్స్ పై ఐటి ని రద్దు చేశాయని, అధికారులకు చేసినట్టుగానే కార్మికులకు సైతం పెర్క్స్ పై ఐటి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల ప్రధాన సమస్య అయినా మారుపేర్లపై గెలిచిన, ప్రాతినిధ్య సంఘాలు స్పందించకపోవడం అమానుష్యమన్నారు. కార్మికుల సమస్యలు పరిస్కారం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకుని గెలిచిన గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు స్ట్రక్చరల్ సమావేశాలలో ఆ ఊసే ఎత్తకుండా, కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి ని సైతం కలిసి, సమస్య పరిష్కారం దిశగా సిఐటియు గా కృషి చేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే యూనియన్ ఎల్లవేళలా పోరాటాలు చేస్తుందని, అందులో బాగంగానే భవిష్యత్తులో నిర్వహించే ఉద్యమాలకు కార్మికులందరూ యూనియన్ లకు అతీతంగా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అండర్ గ్రౌండ్ నుండి సర్ఫేస్ ఓపెన్ కాస్ట్ కు ఖాళీలను కంపెనీ అవసరాలు నిమిత్తం భర్తీ చేస్తుందని, ఆ ప్రక్రియలో కార్మికుల బేసిక్ తగ్గించడం భవిష్యత్తులో పెన్షన్ పై ప్రభావం చూపడం కార్మికునికి ఆర్థికంగా నష్టపరుస్తుందని తెలిపారు. దీనిపై గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కోశాధికారి కస్తూరి చంద్రశేఖర్, మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఆర్జీ 1 అధ్యక్షుడు రాజమౌళి, బ్రాంచ్ నాయకులు బోడకుంట శంకర్, చీకట్ల సాగర్, శ్రీపతి బానేష్, పేరుక సదానందం, మేల్లం శ్రీధర్, శైల శ్రీనివాస్, నరహరి, వెంకట్ రెడ్డి, ఆషాడం రమేష్, మాదాసు విజయ్, ప్రతాప్, ఇతినేని వెంకటేష్, పల్లె రాకేష్, కేసిపెద్ది శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News