- ఎర్రవెల్లి ముత్యంరావు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

నేటి సాక్షి, మంథని (పెయ్యల రమేష్):
మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో కార్మిక కర్షక ఐక్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐటీయూ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రతిగటిద్దాం అనే అంశంపై జిల్లా సదస్సు జరిగింది.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ… కేంద్ర బీజేపీ సర్కార్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తుందని రైతు వ్యతిరేక చట్టాల స్థానంలో జాతీయ మార్కెట్ విధానాన్ని తీసుకువచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని అలాగే వ్యవసాయ కూలీలకు కనీస వేతనం నిర్ణయించకుండా కూలీల బతుకులను ఆగం చేస్తుందని విమర్శించారు. రానున్న కాలంలో కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై జరిగే పోరాటంలో కార్మికులు రైతులు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వెంకటస్వామి,రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండ్రెడ్డి సుధాకర్ రెడ్డి, రాపల్లి తిరుపతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బావు రవి, సతీష్, నాయకులు చిప్పకుర్తి చందు,సింగారపు గట్టయ్య, మల్లేష్,పోచమ్మ,భాగ్య తదితరులు పాల్గొన్నారు.





