Sunday, March 22, 2026

సింగరేణి లో హైపవర్ కమిటీ వేతనాల అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తాం.

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించె విధంగా వాటి అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు పేర్కొన్నారు. గురువారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ…సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా లో అమలు చేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని దీని అమలు కోసం సింగరేణి పై ఒత్తిడి పెంచేందుకు ఏఐటియుసి పోరాటాలు చేస్తాం. అదే విధంగా సివిక్ ఇతర విభాగాల లలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కు కనీస వేతనాల చట్టం అమలు కోసం ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీ.ఓ 22 కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఏఐటియుసి కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణి లో దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులు పర్మనెంట్ కార్మికుల తో సమానం గా పని చేస్తున్నారని, చట్ట ప్రకారం చెల్లించాల్సిన వేతనాలు సింగరేణి యాజమాన్యం చెల్లించడం లేదని, శ్రమ దోపిడి కి గురవుతున్నారని ఆరోపించారు. సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, జీ.ఓ 22 కోసం ఏఐటియుసి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు, కాంట్రాక్టు కార్మికులు ఏఐటియుసి ఇచ్చే పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ న్యాయమైన హక్కుల ను సాధించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా సింగరేణి లో విపరీతంగా రాజకీయ జోక్యం పెరగడంతో సంస్థ అవినీతి మయమైందని ఆరోపించారు. అదేవిధంగా సింగరేణి లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల సాధన కోసం, సంస్థ పరిరక్షణ కోసం సేవ్ సింగరేణి’పేరుతో ఉద్యమం చేపట్టి కార్మికుల ను చైతన్య చేస్తాం. ఇంకా సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్, నాయకులు కన్నం లక్ష్మి నారాయణ, సిర్ర మల్లికార్జున్, పడాల కనకరాజు , సిరిసిల్ల మల్లేష్, వీరగోని మల్లయ్య, ఉప్పులేటి తిరుపతి, సూర్య, వినయ్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News