- ప్రజా సమస్యలపై పోరు ఆగదు
- కాపా డుకుంటాం అక్రమ కేసులకు బయ పడం
- మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
- లక్షెట్టిపేటలో కార్యకర్తల సమావేశం
నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న) : టిఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కాంగ్రెస్ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు బయపడేదే లేదని, అక్రమ కేసులకు గురయిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టిన బయపడేదే లేదని, కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహారిస్తుందని, ఎలాంటి కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, అక్రమ కేసుకు గురైన వారికి అండగా ఉంటామని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీలో ఉన్న ఒక్కో కార్యకర్త వంద మంది కార్యకర్తలతో సమానమని, రాబోయే స్థానిక సంస్థలలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత, అవకాశాలు ఇస్తామన్నారు. ఓడిన గెలిచిన నాయకులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నారు. రాబోయే రోజులన్నీ బీ ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, చిప్పకుర్తి నారాయణ, కలాల రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





