- కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
నేటి సాక్షి,మల్లాపూర్ :- ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టితో ఇందిరమ్మ కలలు కన్నా రాజ్యంగా తీర్చిదిద్దుతానని కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంతోపాటు మండలంలోని రత్నపూర్, కుస్తాపూర్, గొర్రె పెళ్లి ,వేంపల్లి, రేగుంట ,సాతారం ,గుండంపల్లి, చిట్టాపూర్ గ్రామాలలో శనివారం కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, డ్రైనేజీలు నిర్మాణం కోసం సిడిఎఫ్ గ్రాంట్ క్రింద రూ,,48.50లక్షలు నిధులు మంజూరు కాగా వాటికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆలోచనలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిషన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జలపతి రెడ్డి , ఏఎంసీ చైర్పర్సన్ పుష్పలత , మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,లీడర్స్ బాపురెడ్డి, నందు గౌడ్ , మల్లయ్య , రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.





