- రజాక్ దాతృత్వం అభినందనీయం
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
- ఫాతిమా బేగం కుటుంబానికి రూ. 10,000 అందజేత
నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఫాతిమా బేగం కుటుంబ సభ్యులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రజాక్ కుటుంబ సభ్యులు అందజేసిన పదివేల రూపాయలు నగదును శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ కార్యాలయంలో సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపికి రజాక్ లాంటి కార్యకర్తలు ఉండడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు కష్టం వస్తే పార్టీ తరపున సాయం చేసేందుకు ముందుకు వచ్చిన రజక్ ను ప్రశంసించారు. పార్టీ పట్ల అంకిత భావం, చిత్తశుద్ధితో పనిచేసే వారికి ఉన్నత పదవులు లభిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డు మీద పడిన ఫాతిమా కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన పిలిచారు. ఈ కార్యక్రమంలో రజాక్ కుటుంబ సభ్యులు ఎండి రఫీ, టిడిపి మైనార్టీ నాయకులు షేక్ నిజాముద్దీన్, బహుదూర్ భాష, మహమ్మద్ రఫీ, రెడ్డి గిరిజ శంకర్, ఎండు చిన్నారావు పంచిరెడ్డి అప్పలనాయుడు, ముద్దాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

