Friday, March 13, 2026

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : అర్హులైన నిరు పేదలందరికీ రేషన్ కార్డులు అధికారులు సమన్వయం తో అర్హులైన లబ్ది దారులను ఎంపిక చేయాలని, 47, 61 వ డివిజన్ వార్డ్ సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతున్నామని, ఈ పథకాల వివరాలు డివిజన్ లో ప్రజలకు తెలియచేసి మీ అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డ్ సభను ఏర్పాటు చేయడం జరిగిందని కాజిపేట 47, 61 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డ్ సభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డ్ లేని నిరు పేదలను గుర్తించి అర్హులైన నిరు పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణి చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా దరఖాస్త్గులు ఇవ్వదలుచుకుంటే వీటిని స్వీకరించి పరిశీలిస్తామన్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. ఇల్లు కట్టుకునేనేదుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం ఫ్లేని వారిది రెండవ జాబిత తయారు చేయడం జరిగింది. ప్రజా పాలనాలో దరఖాస్తు చేయని వారు చేసిన కూడా ఈ జాబితాలో పేరు లేని వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ శ్రీ రజాలి, జక్కుల రవీందర్ 47 డివిజన్ అధ్యక్షులు షేక్ అస్గర్, 61 డివిజన్ అద్యక్షులు గజపాక రమేష్, మొహమ్మద్ అంకుష్ సాగరిక, గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మానస మధు, ఇప్పా శ్రీకాంత్, మైసరపు సిరియల్ లారెన్స్ సిల్వర్ విజయ భాస్కర్, దొంగల కుమారస్వామి, గరిగే శివ భానుచందర్, మొహమ్మద్ గౌస్ లింగమూర్తి, రాజు , గోపి, రమేష్, బబ్లు, బుసపాక శ్రీనివాస్, దారుల రాజ్ కుమార్, బిడారి రాజేందర్ పోగుల శ్రీనివాస్, మాతంగి స్వామి, రేవతి, లహరి, వెంకట స్వామి, శ్రవణ్ సారంగం భద్రయ్య సాయి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News