- రాజకీయాలకు అతీతంగా పేదలకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలి
- గొంగళ్ళ రంజిత్ కుమార్
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలకు మరియు రేషన్ కార్డుల మంజూరు విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ విషయాలు సేకరించి నిజమైన అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలని అందించాలని ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జిల్లాలో అధికారులు నిజమైన పేదలకు,అర్హులకు ఇండ్లను మరియు రేషన్ కార్డుల మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించి ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అప్పుడే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తుందని అన్నారు.జిల్లాలో అధికారిక పార్టీ గ్రూపుల తగాదాల వల్ల అర్హులైన వారికి ఇండ్లు మరియు రేషన్ కార్డులు అందకపోతే మాత్రం నడిగడ్డ హక్కుల పోరాట సమితి వారి తరఫున నిలబడి పోరాడుతుందని గ్రామాలలో వాస్తవ విషయాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మరానన్న ఎమ్మెల్యే అభివృద్ధి పై దృష్టి పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబుతో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు రంగస్వామి,చిన్న రాముడు,భూపతి నాయుడు కుమ్మరి నాగేశ్ పాల్గొన్నారు.




