నేటి సాక్షి గోదావరిఖని (రమేష్):
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పటల్ నందు వెల్ బేబి షో పోటీలు నిర్వహించారు. ఇట్టి పోటిలకు ఆర్జీ. 1 ఉద్యోగుల బాల, బాలికలను అందంగా తయారు చేసి తీసుకొని రావడం జరిగినది. ఈ కార్యక్రమమానికి ఆర్జీ. 1 సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ ముఖ్య అతిదిగా హాజరై పోటీలను ప్రారంభించటం జరిగింది.
ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ మరియు డాక్టర్ ఎసియంవో కిరణ్ రాజ్ కుమార్ తెలియజెస్తూ ఇట్టి వెల్ బేబి షో పోటీలలో ఆర్జీ. 1 నుండి 38 మంది ఉద్యోగుల 5 సంవత్సరములలోపు బాల బాలికలు చాల ఉత్సాహంగా పాల్గొన్నారని ఈ పోటిల ఎంపికలో పిల్లల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఆకర్షనీయమైన వస్త్రదారణ, అందమైన ముఖ వర్చస్సు, పిల్లల బుడి బుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయడం జరిగినదని తెలిపారు. బేబి కింగ్, బేబి క్వీన్, ఫ్రిన్స్, ఫ్రిన్సేన్స్ పోటీలను వివిధ నిర్వహించడము. జరిగినవని తెలిపారు.ఇట్టి ఎంపికయిన పిల్లలకు సింగరేణి ఆవిర్బావ ప్రదాన వేడుకలో బహుమతుల ప్రాదనోత్సవం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమములో యస్. ఓ. టు జియం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ డి. కిరణ్ బాబు, ఎసియంవో కిరణ్ రాజ్ కుమార్, , ఏఐటీయుసి నాయకులు స్వామీ, మడ్డి ఎల్లయ్య, ఆరేళ్లి పోషం, సేవా సెక్రటరి శిరీష, సేవా జాయింట్ సెక్రటరి బీన సింగ్, చిలుక లక్ష్మి, నీరజ కిరణ్ రాజ్ కుమార్ అధిక సంఖ్యలో బాల బాలికలు పాల్గొన్నారు.