- పెద్దపులి నాగారం గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్ జానయ్య
- సమస్య ఉంది అంటే చాలు నేనున్నాను అంటూ వస్తున్న పంచాయతీ కార్యదర్శి
నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో ఏడవ వార్డులో మరియు ఐదవ వార్డులో గత కొన్ని రోజుల నుండి కరెంటు సమస్యలు ఉన్నాయి. విద్యుత్ దీపాలు వెలగట్లేదు అన్ని సమాచారం తెలియజేయడంతో అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన అంబేద్కర్ విగ్రహం నుండి నందిపల్లి రోడ్డు మార్గంలో నూతనంగా ట్రాన్స్ఫారం ని ఫిట్ చేసిన కారణంగా చెట్ల కొమ్మలను నరికి వేయడం జరిగింది. వెంటనే పంచాయతీ సెక్రటరీ జానయ్యకి తెలియజేయడం గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ ఒకేసారి తీసుకుని వచ్చి ఆ చెత్త చెదారం అంతా తీసేయడం అలాగే ఈరోజు వీధి దీపాలు అన్ని స్తంభాలకు ఫిట్ చేయించడం ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తెలియపరచండి అని ఎస్ జానయ్య పంచాయతీ కార్యదర్శి తెలియజేశారు.





