నేటి సాక్షి, జమ్మికుంట (మోరె ప్రశాంత్) : జమ్మికుంట మారుతినగర్‌కు చెందిన కావ్య జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించగా, మంగళవారం అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్(ప్రభు) ఆమెను సత్కరించారు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కావ్య, ఈ నెల 4న గ్లోబల్ చోటో కాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని, మెడల్స్ కైవసనం చేసుకున్నది. ఈ సందర్భంగా ఆమెను ప్రభు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. జన్ను కావ్య కరాటే పోటీల్లో బంగారం పతకం సాధించడం ఈ ప్రాంతానికే కాకుండా కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని అభివర్ణించారు. అదే విధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తూ వందలాది మందిని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచేలా తయారు చేస్తున్న హుజూరాబాద్ కరాటే మాస్టర్ జలీల్‌ను ప్రత్యేకంగా శాలువతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించాలని కోరారు. యువతి యువకులు చెడు వ్యసనాలకు దూరం ఉంటూ, కరాటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. చదువుతోపాటు ఆటల్లో రాణించాలని సూచించారు.

