బ్రిడ్జి నిర్మాణం చేయకుండా కేవలం వర్షపు నీరు పోవడానికి మత్రమే నిర్మాణం చేయటం ఎంటి !
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామ శివారులో భారత్ మాల 6 వే హైవే రోడ్డు వలన రైతులు తమ పొలాల బాట ఎలా వెళ్ళాలో అర్థం కాక తీవ్ర సతమతం అవుతున్నారు. అంతే కాక గతంలో ఉన్న బాట ను తీసేసి బాట లేకుండా చేశారు. మా పొలాలు కి ఎలా వెళ్ళాలి అని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గతంలో ఉన్న బాట నీ కూడా అదేవిధంగా బాట ఉండేలాగా చేయాలని రైతులు తమ గొడును విన్నవించుకున్నారు. కాబట్టీ వెంఠనే అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి బాట ఉండేలాగా డ్రాప్ లు కట్టి అన్ని వాహనాలు మరియు ఏడ్ల బండ్లు తిరేగే విధంగా బాట ను చేయాలి అని కోరుతున్నారు. బాట వేయకుండా కేవలం వర్షపు నీరు పోయేలాగ మాత్రమే ఒకా కాలువ గా మాత్రమే నిర్మాణం జరుగుతుంది కాబట్టీ వెంఠనే భారత్ మాల హైవే కాంట్రాక్టర్ లు బ్రిడ్జి నిర్మాణం చేసి బాట చేయాలీ అని రైతుల తమ ఆవేదన ను వ్యక్తం చేశారు.





