- మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్
- ఎన్నికల హామీలు విస్తరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
- మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 420 రోజులైనా ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలు ఏమయ్యాయని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకుడు నిమ్మశెట్టి విజయ్ ప్రశ్నించారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ… ప్రజాపాలన పేరుకే పరితమైందని, ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడంలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టి ఆబద్దాలతో అధికారంలోకి వచ్చి 420 రోజులైంది కానీ 4 పథకాలు కూడా అమలు కాలేదన్నారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటి సంపూర్ణంగా అమలు చేయలేదని విజయ్ అన్నారు. అలాగే రైతులకు రైతు భరోసా 15000లు ఇస్తామని 120000లు ఇస్తామని చెప్పడమే కానీ కానీసం ఆ 6000లు కూడా ఇవ్వకుండా రైతులని ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. మొన్నటికి మొన్న 4 గ్యారంటీల ఆమలు ఆనీ లిస్ట్ లో పేర్లు చెప్పి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మియ భరోసా,రైతు భరోసా ఆంటూ ప్రజలను గారడి చేశారే తప్ప ఏక్కడ వాటిని ఆమలు చేయలేదన్నారు. దరఖాస్తుల పేరిటా ప్రజలను ఆశల పల్లకీలో ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారనీ ఆన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పథకం అమలు చేయకుండా, ప్రాజెక్ట్ లు కట్టకుండా 14 నెలల వ్యవధిలోనే ఒక లక్ష 40,000 కోట్ల అప్పు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కెసిఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చెపుతున్నారని ఆనవాళ్లు ఆంటే రైతు బంధు, రుణమాఫి,24 గంటల కరెంటు, దళితబంధు, బిసి బంధు కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలను ప్రజలకు అందించకుండా చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో గ్రామ పంచాయితీ, ఏంపిటిసి, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరాల శేఖర్, గోలి మహేష్, జోగిని శంకర్, బత్తుల దేవరాజు, కొండ కనకయ్య, మిర్యాల సంతోష్, గజ్జెల రమేష్, సంతోష్ యాదవ్, సయ్యద్ ఉమర్, మంతె సందీప్, రవిచంద్ర, హరిష్, రాకేష్, సాయిక్రిష్ణ, దేవరాజ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.





