- మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి
- మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి డిసెంబర్ 19 :
వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్ మాట్లాడుతూ రైతులకు ముఖ్యమైనవి మూడు, సాగునీరు, రైతుకు ఉచిత విద్యుత్, రైతుకు పెట్టుబడి సాయం కావాలి. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని రైతులను మోసం చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ అసంపూర్ణంగా చేశారు, రైతులకు రుణమాఫీ అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఒట్టు వేసి మాయమాటలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు,పింఛన్ సదుపాయం కల్పించలేదు,చదువుకున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని మాట తప్పారు,చదువుకున్న విద్యార్థులకు పై చదువుల కోసం 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తానని అన్నారు, ప్రతి మహిళకు 2500 ఇస్తానని మాట ఇచ్చారు, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ జీవనోపాధి కోసం ఆటోలు తెచ్చుకొని వారు జీవనోపాధి కోల్పోయారు, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తానని మాట తప్పారు. కౌలు రైతులకు కూడా ఆదుకుంటానని సీఎంపీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటలు అన్ని వుట్టివే అయ్యాయి. రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్ళిన రైతు రుణమాఫీ విషయంలో ఎవరైనా రైతులు రుణం తీసుకొని వారు ఉంటే ఖచ్చితంగా మేము రైతు రుణమాఫీ మొదటి ప్రాధాన్యతగా మాఫీ చేస్తామని రైతులను నమ్మించి పెద్ద ఎత్తున ఓట్లు వేయించుకోవడం జరిగింది. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ నియోజకవర్గానికి వెళితే అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ఓట్లు వేసి కచ్చితంగా రుణమాఫీ చేస్తామని రైతులను ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులే అయింది అని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత రుణమాఫీ గురించి మర్చిపోయి వాళ్లు రుణమాఫీ చేయడానికి వాళ్లు ఎంచుకున్న ప్రక్రియనే తప్పు వనపర్తి నియోజకవర్గం లో రైతుబంధు తీసుకున్నా రైతులు దాదాపు 90 వేల మంది ఉన్నారు. 90000 మంది రైతులకు రైతుబంధు మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని సీజన్లో కలిపి 907 కోట్ల రూపాయలు రైతుబంధు రూపంలో చెల్లించడం జరిగింది. దాదాపు 93 వేల మంది రైతులకు రైతుబంధు వస్తుంటే దాంట్లో కనీసం 80 శాతం మంది అయినా బ్యాంకులో కెళ్ళి రుణాలు తీసుకుంటారు. అంటే దాదాపు 72,000 మంది రైతులు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు.అర్హులను ఏ విధంగా ఎంపిక చేసి దానిలో భాగంగా చేసిండ్రు ఆ విధానమే తప్పు ఆ రైతుబంధు తీసుకున్న ప్రతి రైతు రుణం తీసుకుంటారు కొంతమంది అనివార్య కారణాలవల్ల 20 శాతం మంది రుణాలు తీసుకోకపోయినా దాదాపు 70000 మంది రైతులు రుణాలు తీసుకున్నా రైతులు ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం రుణమాఫీ కింద అర్హులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది 43, 601 మందిని సెలెక్ట్ చేశారు మిగతా సగం మంది ఏమైపోయిండ్రు ఎక్కడ ఉన్నారని ఏ ముఖ్యమంత్రి మంత్రి చెప్పడని అదేవిధంగా లక్షలోపు ఉన్నవాళ్లు వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు అర్హులైన రైతులు 30,136మంది రైతులు ఉన్నట్లుగా గుర్తించారు ఇప్పటివరకు రుణమాఫీ వచ్చిన రైతులు 20307 మందికి రుణమాఫీ జరిగింది.ఇంకా 9829 మంది ఇంకా మిగిలి ఉన్నారు వనపర్తి నియోజకవర్గం లో మొత్తం 43601 మంది ఉంటే 28 406 మందికి రుణమాఫీ అయింది.ఇంకా 15 వేల195 మందికి రుణమాఫీ కాలేదు పాలకులు మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని పాలకులకు పాలన మీద పట్టు లేదని ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ, రైతు బంధు పథకం, రైతు బీమా తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిగా ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించాడని, రైతులను మోసం చేశాడని పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్,మాజీ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, ఖిల్లా ఘన్పూర్ ఎంపీపీ కృష్ణ నాయక్, శ్రీరంగాపురం మండల్ సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం నాయుడు, శ్రీరంగాపురం మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్, రేవల్లి మాజీ ఎంపీపీ సేనాపతి, జిల్లా గొర్ల కాపరుల సంఘం మాజీ అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, టి,ఆర్,ఎస్ పార్టీ వనపర్తి మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం, పెబ్బేరు మాజీ జెడ్పిటిసి పద్మా వెంకటేష్, గోపాల్ పేట రైతుబంధు అధ్యక్షులు ఏ. తిరుపతయ్య యాదవ్, వనపర్తి మండల రైతు సమితి అధ్యక్షులు దేవర్ల నరసింహ, రాజపేట మాజీ సర్పంచ్ జ్యోతి మాధవరెడ్డి,వనపర్తి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంధం పరంజ్యోతి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పసుల బాలకిష్టయ్య,టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్, పెండ్యం నాగన్న యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు, గోపాల్పేట మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బి, బాలరాజ్, తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫైడ్ డైరెక్టర్ విజయకుమార్, వనపర్తి మండలం మాజీ జెడ్పిటిసి ధర్మ్యా నాయక్, టిఆర్ఎస్ పార్టీ జేఏసీ నాయకులు జాతృ నాయక్, టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులు ఎం చంద్రశేఖర్ నాయక్, శ్రీరంగాపురం మాజీ ఎంపీటీసీ ఆర్ గౌడ నాయక్, వనపర్తి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి ప్రకాష్ రెడ్డి, వనపర్తి మండల నాయకులు డేగ మహేశ్వర్ రెడ్డి, వనపర్తి పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్టార్ రహీం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు డి శ్రీనివాస్ రెడ్డి, ఎం రమేష్ (సర్పంచ్ ), కంచిరావుపల్లి సర్పంచ్ యాదగిరి, గోపాల్పేట మండలం కోఆప్షన్ సభ్యులు ఎండి మతిన్, బి మధు ముమ్మాలపల్లి, సోషల్ మీడియా కన్వీనర్ వడ్డే రమేష్, మాదరాపల్లి ఎం బాలరాజు, ఎం రమేష్ నాయక్ ఎస్ ఆనంద్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.