- పలాస మున్సిపాలిటీ కొత్త రూపురేఖలు
- పలాస స్థానికులు నమ్మకంతో ఉన్నారు
- పలాస లో ఏం 2019//2024 నుండి ఏం జరగబోతుంది….?
నేటి సాక్షి పలాస కాశీబుగ్గ రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం లో 2019లో వైసీపీ ప్రభుత్వం లో చేసిన అరచకాలు అవినీతి ఎంత అంతా కాదని అభివృద్ధికి దూరం ఉన్న ప్రభుత్వమని నమ్మిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి 2024 భారీ మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. నమ్మకంతో వినితి పత్రాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పుట్టుకుని వస్తున్నాయి…? గోళ్ళ చంద్రర్రావు 21వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నమస్కారించి తెలియజేయు విన్నపాలు. 21 వ వార్డ్ పలాస కాశిబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఉన్నా నెహ్రు పార్క్ (ముత్యాలమ్మ కోనేరు )లో గత కొద్ది సంవత్సరాలనుండి పేరుకుపోయన సమస్యలు తమరికి తెలియపరిచుచున్నాను. 21 వార్డ్ పరిధిలో భాగమైన నెహ్రు పార్క్ (ముత్యాలమ్మ కోనేరు )లో ప్రతి రోజు అనేకమంది ఉదయం సమయంలో వాకింగ్ చేయడంతో పాటు సాయంత్రం సమయంలో ఆహ్లాధకరమైన వాతావరణం ఉండడం వలన అనేక కుటుంబాలు పార్క్ నకు విచ్చేసేవారు, కానీ నేడు ఆ పార్క్ పరిసరాలు ఆ సాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది తమరు ఆ పార్క్ అభివృద్ధి పట్ల ద్రుష్టి సారించి ఆ పార్క్ లో లైట్లను వేసి, గార్డెన్‌ను మొక్కలు వేసి,పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు అదేవిధంగా పలాస కాశిబుగ్గ” అనే సైన్ బోర్డు పెట్టి, పాత విధంగా ఆహ్లాద కరమైన వాతావరణం కల్పించి పట్టణ ప్రజలకు ఉన్నా ఏకైక పార్క్ ను అభివృద్ధి చేయాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా పలాస కాశిబుగ్గ లో ఉన్నా పేద-మధ్య తరగతి కుటుంబాల నివాస గృహాలకు నూతన విధ్యుత్ మీటర్ శాంక్షన్ విషయంలో విధ్యుత్ శాఖ అధికారులు NOC అని నానా రూల్స్ పెడుతున్నారు. వాటి వలన గృహ నిర్మాణదారులు ఇబ్బందులు గురి అవుతున్నారు, కొత్త మీటర్స్ శాంక్షన్ విషయంలో గృహ నిర్మాణ దారులకు పాత పద్ధతిలా వేసులు బాటు కల్పించేలా విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రజలకు న్యాయం చెయ్యగలరు అని మనవి చేస్తున్నాను. నేను గతం లో ఇచ్చిన ఆంధ్రా బ్యాంక్ రోడ్ సెంటర్ లో బైక్ పార్కింగ్ ఏర్పాటు చెయ్యవలసినదిగా విజ్ఞప్తి చేసివున్నాం. త్వరగా బైక్ పార్కింగ్ కు మార్కింగ్ (డబల్ రోడ్ )చేసి ప్రజలు కోరికను అమలు చేయగలరని మళ్ళీ కోరుతున్నాను అని గోళ్ళ చంద్రరావు మాజీ కౌన్సిలర్ 21 వ వార్డు (పార్క్ పరిధి) తెలుగుదేశం పార్టీ ఇంచార్జి రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ 2019 నుండి సమస్యలతో కొట్లాడుతున్న పలాస మున్సిపాలిటీ కొత్త రూపురేఖలు మారుస్తారని నమ్మకంతో పలాస మాజీ మంత్రి శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె అయిన గౌతు శిరీష కి వినతి పత్రాలు జోరుగా రోజు రోజుకి పుట్టగొడుగుల పుట్టుకొని వస్తున్నాయి. ఆ సమస్యలు ఎటువైపు ఎటు దారి తీస్తుందని సమస్యలు పరిష్కారం జరుగుతదని అందరూ ఎదురు చూస్తున్నారు.

