Friday, March 20, 2026

తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించేది ఎప్పుడు

నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి, (గుండ ప్రశాంత్ గౌడ్) : విద్యారంగాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మన అగ్రికల్చర్ కాలేజీ మనకు కావాలి మన నవోదయ పాఠశాల మనకు కావాలి. విద్యార్థి విభాగం రాష్ట కార్యదర్శి పాదం తిరుపతి విద్యార్థి విభాగం గొల్లపల్లి మండల అధ్యక్షులు అవారి చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి విభాగం రాష్ట కార్యదర్శి పాదం తిరుపతి మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆనాటి రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ చెరువతో మన ఈ ప్రాంతానికి అగ్రికల్చర్ కాలేజీ నీ కొప్పుల ఈశ్వర్ మంజూరు చెపించారు. ఇట్టి కాలేజీ కి
సెప్టెంబర్ 03 2023 రోజున నాటి మంత్రివర్యులు కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ ఇతర నాయకులు అందరూ కలసి ఫౌండేషన్ కూడా వేసినారు ఇట్టి కాలేజీ నిర్మాణం కోసం స్తంబంపల్లి శివారులో 40 ఎకరాల స్థలం కూడా కేటాయించినారు. ఇట్టి స్థలంలో కాలేజీ ఏర్పాటు చేయకుండా ఈ కాలేజీ కి జగిత్యాల కి తరలించారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఏం చేస్తున్నారు అని అన్నారు అదే విధంగా జగిత్యాల జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాల కోసం ధర్మపురి మండలం నేరెళ్ళ లో సర్వే నెంబర్ 252 లో 30 ఎకరాల స్థలం కేటాయించారు కానీ ఇట్టి కాలేజ్ నీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ తరలించాలని చూస్తున్నారు ఇట్టి కాలేజ్ ధర్మపురిలో ఏర్పాటు చేసే విధంగా లక్ష్మణ్ కుమార్ కృషి చేయాలి అని అన్నారు ఈ ప్రాంతంలోని పేద విద్యార్థుల చదువుల కోసం కొప్పుల ఈశ్వర్ 2 కోట్ల తో అంబేద్కర్ విజ్ఞాన భవన్ కోసం నిధులు కేటాయిస్తే దానిని స్థానిక ఎంఎల్ఏ భవనం నిర్మించకుండ గాలికి వదిలేశారు అని అన్నారు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 14 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగానికి కనీసం ఒక మంత్రిని నియమించకుండా జాప్యం చేస్తూ విద్యారంగాన్ని గాలికి వదిలేసి. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారనీ రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది అని ఎటువంటి పట్టింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది అని వారు కాంగ్రెస్ ప్రభుత్వం పై ద్వజమెత్తారు ఒకపక్క గురుకుల విద్యాలయాల లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణిస్తుంటే మరోపక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నీంటిలో అర కొర సౌకర్యాలు, అధ్యాపకుల లేమి, మంచినీరు సమస్య, సరిపోనీ తరగతి గదులు, శిధిలావస్థలో బిల్డింగులు, అద్దె భవనాల్లో విద్యాసంస్థల నిర్వహణ లాంటి లోపాలతో ప్రభుత్వ విద్యా సంస్థలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ విద్యాసంస్థల నిర్వహణకు ఉద్యోగుల జీతభత్యాలు కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అన్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కొత్త సీసాలో పాత సార చందంగా విద్యార్థులకు పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తోడై స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా సంవత్సరాల తరబడి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా వేల కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచి విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో కొంతమేరకైనా సమస్యలు పరిష్కరించబడాలి అంటే కొఠారి కమిషన్ సూచించిన మేరకు రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని వారి డిమాండ్ చేశారు విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నూతన ముసాయిదాను ప్రవేశపెట్టి వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులను వైస్ ఛాన్స్లర్ గా నియమించి విశ్వవిద్యాలయాలలో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కుట్రలో భాగంగానే నూతన ముసాయిదాను తీసుకొచ్చిందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి చేతులు దులుపుకోవడం కాకుండా అడ్డుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో చెందోలి మాజీ సర్పంచ్ అలిశెట్టి రవీందర్ గొల్లపల్లి మాజీ ఉప సర్పంచ్ కానుకుంట్ల లింగారెడ్డి బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు కనుకుంట్ల లింగారెడ్డి, దావుల రాకేష్ బి ఆర్ ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షులు సమల వీరస్వామి విద్యార్థి విభాగం మండల ఉపాధ్యక్షులు చింతకుంట శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News