- కొత్త రేషన్ కార్డుల మంజూరీతో 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం
- 70% నికి ఆహార భద్రత కల్పించాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పం
- ప్రజాపాలన, ప్రజావాణి, ఈ-సేవ లలతో పాటు గ్రామ సభలలో ఇచ్చే దరఖాస్తులు పరిగణలోకి తీసుకుంటాం.
- రేషన్ కార్డుల మంజూరీలో ఎటువంటి అపోహలకు తావు లేదు
- ఏ ఒక్కరూ ఆందోళన చెందకండి
- ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12000
- వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతుభరోసా
- పాలేరుతో పాటు మోతే మండలానికి గోదావరి జలాలు
- కోదాడ బస్ డిపో పునరుద్ధరణకు 18 కోట్లు
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్లు గా విస్తరణ
- మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి సతీష్ : అర్హులైన నిరుపేదలందరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో 40 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు గురువారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కోదాడ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ సమావేశానికి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ70% శాతం ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అని ఆయన తేల్చిచెప్పారు,ప్రజాపాలన,ప్రజావాణి,ఈ-సేవ,లతో పాటు ఇప్పుడు జరుగుతున్న గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వారు ఇచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రేషన్ కార్డుల మంజూరు లో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు .ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియని,అర్హులై ఉండి కార్డు లేని వారందరకు తెల్ల రేషన్ కార్డు అందేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తామన్నారు. స్థలం ఉండి ఇళ్లు నిర్మించు కునే లబ్ధిదారులకు ఐదు లక్షలు, ఎస్.సి,ఎస్.టి లకు ఆరు లక్షల చొప్పున అందిస్తామన్నారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12000 రూపాయలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రైటుభరోసా అమలు పరచనున్నట్లు ఆయన వెళ్ళడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అమలు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. పాలేరుకు గోదావరి జలాలూ తరలించడంతో పాటు లింక్ కేనాల్స్ ద్వారా పాలేరుకు నీటి తరలింపు ఉంటుందన్నారు. అదే క్రమంలో కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలానికి పాలేరుతో పాటు మోతే మండలానికి గోదావరి జలాలు అందించ నున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కోదాడ బస్ డిపో పునరుద్ధరణ గాను 18 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించేందుకు గాను తాను లోకసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఒక కొలిక్కి తీసుకొచ్చానన్నారు. అంతే గాకుండా కోదాడ పట్టణానికి రైలు మార్గం తెచ్చేందుకు గాను రూట్ మ్యాప్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, ఎర్నేని బాబు, పార సీతయ, కందుల కోటేశ్వరరావు, జబ్బార్, అల్తాఫ్ హుస్సేన్, ముస్కు శ్రీనివాసరెడ్డి, కొణతం శ్రీనివాసరెడ్డి, కే ఎల్ ఎన్ ప్రసాద్, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





