- వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వర రావు
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : పాన్ గల్ గ్రామం లో ఈ నెల 1న అనుమాన స్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కేసును పానుగల్ పోలీసులు చేదించారు. అందుకు సంబంధించిన వివరాల ను శుక్రవారం వనపర్తి సర్కిల్ కార్యాలయంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వర రావు వివరాలు వెల్లడించారు.ఎండి. జాఫర్ ఖాన్ స/ఓ మన్సూర్ ఖాన్, వయస్సు: 45 సంవత్సరాలు, కులం: ముస్లిం, ప్రాంతం: వ్యాపారం, పానగల్ గ్రామం మరియు మండలం.పానగల్ గ్రామానికి చెందినా ఎండీ పర్వీన్ బేగం w/o ఎం.డి రహమతుల్లా, వయసు 26 సం. లు ఇప్పటికి సుమారు 12 నం.. రాల క్రితం కర్నూల్ పట్టణానికి చెందినా ఎండి రహమతుల్లా s/o అబ్దుల్ మదిని, వయసు 44 ససంవత్సరాలు తో వివాహం అయినది. వారికి ఒక అబ్బాయి, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం కలరు. వారికి పెండ్లి అయిన తరువాత రెండు సం.రాలు కర్నూల్ పట్టణంలో ఉన్నారు. వారిద్దరి మధ్య సంసారం విషయం లో గొడవలు రావటంతో, అందాజ పది సంవత్సరాల క్రితమే భార్య భర్తలు మరియు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పానగల్ కు వచ్చి సంతబజార్ కు దగ్గరలో కిరాయి ఇంటిలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె భర్త పెయింటింగ్ పని మరియు మటన్ కటింగ్ పనిచేస్తు, ఆమె సంతబజార్ నందు ఒక టైలర్ షాప్ లో టైలరింగ్ నేర్చుకొను చుండగా టైలరింగ్ షాప్ పక్కన వుండే కిరాణం షాపు నడుపుచున్న (ఎ -1) కుమ్మరి రాఘవేంద్ర వయసు 31 సంవత్సరాలుతో పరిచయమై, వారిద్దరి మధ్య అక్రమ సంబందం ఏర్పడింది. పర్వీన్ తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో, రాఘవేంద్రను ఇంటికి పిలిచేదని అల చాలా సార్లు వారు శారీరకంగా కలిసివాళ్ళని తెలిపినది. అదే క్రమం లో అందజా ఒక నెల తరువాత పర్వీన్, రాఘవేంద్రలు ఇంటిలో ఉండగా ఆమె భర్త రహమతుల్లా వారిని చూసి పట్టుకొని వారిద్దరిని కొట్టినాడని. అట్టి విషయంలో ఆమె భర్త రహమతుల్ల పానగల్ గ్రామంలో గల పీర్ల చావిడి నందు వారి ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి వారిని మందలించినాడు, వారి అక్రమ సంబంధం మనసులో పెట్టుకొని ఆమె భర్త రహమతుల్లా తరుచూ ఆమెను చిత్రహింసలు పెడుతు, రాఘవేంద్రతో కూడా గొడవ పెట్టుకొనేవాడు. ఆమె భర్త బ్రతికున్నంత కాలం వారికీ ఇబ్బందులు తప్పవని భావించి, ఎలాగైనా సరే రహమతుల్లా ను చంపమని లేదా ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళమని రాఘవేంద్ర తో చెప్పగా, రాఘవేంద్ర తనకు పరిచయమున్న కురుమూర్తి తో అట్టి విషయం చెప్పి దానికి గాను కురుమూర్తి రాఘవేంద్ర కు ఇవ్వవలసిన డబ్బులు మాఫీ చేస్తానని చెప్పటంతో కురుమూర్తి కూడా అందుకు ఒప్పుకాగా, అందుకు ఆమె కూడా సరే అని ఒప్పుకున్నాది. వారు అనుకున్న పథకం ప్రకారం తేది 01.03.2025 రోజు తెల్లవారుజామున అందాజా 04:00 నాలుగు గంటల సమయంలో రాఘవేంద్ర, కురుమూర్తిని రహమతుల్ల ఇంటికి పంపించి రహమతుల్లాతో గొర్రెను కోసేది ఉంది అని చెప్పి తన వెంట తీసుకొని పానగల్ గ్రామా శివారులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర ఉన్న కేల్ ఐ కాలువ దగ్గరకు వెళ్ళగా. అప్పటికే రాఘవేంద్ర తన బైకు పై అక్కడికి వచ్చి వారికీ కనిపించకుండా దాగుకొని వెనకాల వస్తున్న రహమతుల్లాను రాఘవేంద్ర, రహమతుల్లా చేతిలో ఉన్న కత్తిని లాగి విసిరేసి అతనిని కూడా క్రింద పడవేయాగా రహమతుల్లా అరుస్తుండగా రాఘవేంద్ర తన చేతులతో అతని నోరును మూయటానికి ప్రయత్నించగా, రహమతుల్లా రాఘవేంద్ర ఎడమ చేతి చూపుడు వెలిని కొరికినాడు, దాని వాళ్ళ రాఘవేంద్ర గోరు ఊడిపోయి రక్తం కారినది. అప్పుడు రాఘవేంద్ర తన చేతులతో అతన్ని గొంతు పిసుకుతుండగా కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. అప్పుడు రాఘవేంద్ర వెంటనే కురుమూర్తి మెడలో ఉన్న కర్చీపు తీసి రహమతుల్లా గొంతుకు బిగించి ఊపిరాడనియకుండా గట్టిగా పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా ఉపిరిఆడక చనిపోయాడు. దాంతో ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని రహమతుల్లా శవమును మరియు అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కెఎల్ఐ కాల్వలో పడేసి, రహమతుల్లా ను చంపడానికి వాడిన రక్తం అంటిన కర్చీపు అక్కడే ఎక్కడో పడిపోయినది. ఆ చీకటిలో వారికీ దొరకలేదు. రహమతుల్లా కాలువలో పడి చనిపోయాడని అనుకునే విధంగా అతని చెప్పులు టోపీ కూడా తీసి కాలులో పడేసి రాఘవేంద్ర మరియు కురుముర్తిలు కలిసి మోటార్ సైకిల్ పై వెళ్లిపోయినారు.నిందితుల వివరాలు.ఎ -1: సూగూరు రాఘవేందర్ S/o బిచిన్న, వయస్సు 31 సంవత్సరాలు, కులం: కుమ్మరి, Dxc వ్యాపారం, R/o H.No: 8-53, సంతబజార్, పాన్ గల్ గ్రామం మరియు మండలం, వనపర్తి జిల్లా.ఎ -2-ప్యాట కురుమూర్తి S/o పి. నర్సింహ, వయస్సు: 30, కులం: ఎస్సి –మాదిగ, ఓసీసీ లేబర్, R/o H.No: 3-1, ఎస్సి కాలనీ, పానల్ గ్రామం మరియు మండలం, వనపర్తి జిల్లా,ఎ -3-పర్వీన్ బేగం W/o రహమతుల్లా, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: ముస్లిం, ఓసీసీ: టైలర్, R/O పంగల్ గ్రామం మరియు మండలం, వనపర్తి జిల్లా,
నిందితుల నుంచి స్వాధీన పరచుకున్న వస్తువులు:1) నేరస్తలంలో నిందితులు మృతుడిని చంపటానికి ఉపయోగించిన మోటార్ సైకిల్
2) నిందితుల మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన వనపర్తి సీఐ, కృష్ణ, పానుగల్ ఎస్సై,శ్రీనివాసులు , పోలీసు సిబ్బందిని డిఎస్పీ ప్రత్యేకంగా అబినధించారు.ఈ సమావేశంలో వనపర్తి సీఐ, కృష్ణ, పానుగల్ ఎస్సై, శ్రీనివాసులు, శిక్షణ ఎస్సైలు, హిమబిందు,నరేష్, వేణుగోపాల్ దివ్యా రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



