- సందిగ్ధంలో మాజీ ఎంపీటీసీలు !
- మెజారిటీ సభ్యులు సర్పంచ్ వైపే చూపు
- బీసీ కులగనలతో రిజర్వేషన్లు తారుమారు అయ్యే ఛాన్స్ ?

నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్) : మండల, జడ్పిటిసిల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ కొందరు మాజీ సర్పంచులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికలు మొదటగా ఆనాటి ప్రభుత్వం నిర్వహించగా సర్పంచ్ బరిలో నిలబడి పరాజయం పొందిన వారు సానుభూతితో ఎంపీటీసీ ఎన్నికలలో విజయాన్ని సాధించారు. అనంతరం ఎంపీటీసీలకు అంతగా ఫండ్ లేకున్నా “ఇజ్జత్ కె సవాల్” అంటూ కొందరు సొంత డబ్బులతో గ్రామాలలో పనులను చేశారు. అలాగే నేడో.. రేపో.. ఎంపీటీసీ, జడ్పిటిసి లకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నందున రామడుగు మండలంలో ఆశావహులు ఎవరు ? మాజీలు బరిలో నిలుస్తారా ? అని ఇక్కడ చూసిన ఇవే మాటలు కనిపించడంతో రామడుగు రాజకీయ కోలాహలం కనిపిస్తున్నది. అలాగే అధిష్ఠానం ఈ సారి కండువాలు వేసుకున్న వారికి మద్దతు తెలుపుతారా ? లేక ప్రారంభం నుండి కండువాలు మోసిన వారికి మద్దతు తెలుపుతరా ? అన్నదే తేలడం లేదు.
మెజారిటీ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ వైపే చూపు ?
ఐదేళ్లు ఎంపీటీసీగా గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఆనాటి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఇదే రిజర్వేషన్ ఉంటుందని తెలుపగా కొంతమంది మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ రిజర్వేషన్ పై నమ్మకం పెట్టుకొని గ్రామాలలో అభివృద్ధి పనులను నిర్వహించారు. కానీ నేటి ప్రభుత్వం బీసీ కులగరణతో రామడుగు మండలంలోని పలు గ్రామాలలో రిజర్వేషన్లు కారు మారు అయ్యేటట్లు కనిపించడంతో మాజీ ఎంపీటీసీలు, రానున్న ఎంపీటీసీ ఎన్నికలలో బరిలో నిలవాలా ? లేక సర్పంచ్ రిజర్వేషన్ వస్తుందా లేదా ? అనే సందిగ్ధంలో కొట్టు మిట్టలాడుతున్నారు. మరి నేడు, రేపు ముసాయిదా జాబితా విడుదల అవుతుందని ప్రభుత్వం చెబుతుండగా ఇప్పుడు రామడుగు మండలంలోని పలు గ్రామాలలో ఈ నోట విన్న ఎంపీటీసీలు బరిలో నిలుస్తారా ? లేక సర్పంచ్ బరిలో నిలుస్తారా ? అని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు సర్పంచ్ బరిలో నిలుస్తామని ధీమా పెట్టుకుంటే ఉన్న ఛాన్స్ కాస్త పోతే పొలిటికల్ కెరియర్ కే మచ్చ పడేలా ఉన్నదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సర్పంచ్ సీటుపై ఆశపెట్టుకున్న కొందరు అయోమయంలో కొట్టుమిట్టలాడుతున్నట్లు రామడుగు మండలంలో రాజకీయం కనిపిస్తుంది.





