Thursday, March 19, 2026

పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి

  • వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): పదోన్నతుల తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ సిపి పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏ. ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తూ ఎస్. ఐ లు పదోన్నతి పొందిన సంపత్, యాదగిరి, విజయ్ కుమార్ లు మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ మార్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ వీలైనంత వరకు ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు బంగం కలిగించే రీతిలో వ్యహరించవద్దని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News