Saturday, March 21, 2026

నీలకంఠుడి ఆశీర్వాదంతో నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలి

  • ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఆ ఆదిదేవుడు, నీలకంటేశ్వరుని ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలందరూ పాడిపంటలతో సస్యశ్యామలంగా, ఆయురా రోగ్యాలతో ఆనందంగా ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరుకున్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ శివాలయంలో నిర్వహించిన శివ స్వాముల ఇరుముడి మహోత్సవ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాలాధారణ వ్రత దీక్ష కార్యక్రమం మనుషులలోని దుర్గుణాలను దూరం చేసి దైవచింతనను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరుముడి మహోత్సవ కార్యక్రమం నిర్వాహకులకు 50 వేల రూపాయలను విరాళం గా అందజేశారు. కార్యక్రమంలో మాలాధారణ గురుస్వాములు, శివ స్వాములు పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News