నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న గాజుల ఓదమ్మ (68) అనే మహిళను కారు ఢీ కొట్టింది. శంకరపట్నం కాలవల గ్రామానికి చెందిన ఒదమ్మ బందువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళుతుండగా జూపాక రోడ్డు క్రాస్ రాంపూర్ గ్రామంలో రోడ్డు ప్రక్కన నిలబడి ఉండగా సాయంత్రం హుజురాబాద్ వైపు వెళుతున్న కారు ఢీ కొట్టగా ఓదమ్మ కింద పడిపోయి తలకు, ఎడమ చేయి, కాళ్లకు, పక్కబొక్కలకు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి, ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7:30 గంటలకు చనిపోయింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కారు నడిపిన ఖాజా కలీంఉల్లా పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

