Monday, March 30, 2026

సృష్టికి మూలం మహిళ

  • మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
  • మహిళ జ్ఞానవంతురాలు అయితే కుటుంబంతో పాటు ఊరు కూడా బాగుపడుతుంది
  • మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు
  • నియోజకవర్గ మహిళలకు అన్నివేళల అండగా ఉంటాను
  • గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • తరలివచ్చిన మహిళ. లోకం
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొన్న మంత్రివర్యులు ఎమ్మెల్యే

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల టౌన్ నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గద్వాల్ శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సతీమణి మహిళా దినోత్సవం వేడుకలు సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి గారు మహిళలతో చిన్నారితో కలిసి కేక్ కటింగ్ చేసి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ పాఠశాల చిన్నారుల చే నిర్వహించిన సంస్కృత కార్యక్రమాలను , నత్య ప్రదర్శనను, చిన్నారులను అభినందించిన మంత్రి మరియు ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రివర్యులు గారు, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సతీమణి గారు, ఎమ్మెల్యే మాతృమూర్తి తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి చేతుల మీదుగా వివిధ రంగాలలోని మహిళా ఉద్యోగులకు శాలువాలు కప్పి జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే దంపతులు కి అంగన్వాడి టీచర్లకు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు, మహిళా సమాఖ్య సభ్యురాలు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
నేడు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళల అభివృద్ధి కొరకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగింది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించడం జరుగుతుంది. మంత్రివర్యులు మాట్లాడుతూ…. మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు . ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కొరకు మహిళల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మహిళలు వాటిని ఎదుర్కొనే విధంగా ఉండాలి అంటే ధైర్యవంతురాలు గా ఉండాలని కోరారు. చిన్న వయసు నుంచి పిల్లలకు మంచి విషయాలపై అవగాహన కల్పించాలి అదేవిధంగా సమాజం పట్ల కూడా అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరు ఐదు విషయాలపై శ్రద్ధ వహించాలి చదువు, ఆరోగ్యం ,సమయపాలన, సాంప్రదాయం , నడవడిక అవగాహన ఉండాలి. నేడు పురుషులతో సమానంగా స్త్రీలను కూడా చదువుకోవాలని జరుగుతుంది. అప్పట్లోనే మొట్టమొదటి మహిళా చదువుకున్నది సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని కృషి చేయడం జరిగింది నేడు పురుషులతో సమానంగా మహిళలు కూడా చదువుకోవడం వల్ల అన్ని రంగాలలో రాణించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరూ తమ జీవితం ప్రతిరోజు ఒక గంట పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చెప్పితే లాంటి వైద్యానికి ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి ఉండదు ఆరోగ్యంగా ఉంటే ఎంత కష్టమైన పనినైనా సులభంగా చేయగలం అని తెలిపారు. ప్రస్తుతం చిన్న పిల్లలకు గుండెపోటు రావడంతో వారు మరణించడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు ఒక గంట సమయం కేటాయించాలని సూచించారు. మహిళలు మన జీవితంతోపాటు సొంతంగా స్వయం ఉపాధి పొందే విధంగా మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి వాటికి ప్రభుత్వం నుండి రుణాలు రావడం జరుగుతుంది. వాటి ద్వారా మహిళలు మహిళా సంఘాలతో చిన్నచిన్న పరిశ్రమలలో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని జీవన ఉపాధికి తోడ్పాటు కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సమాజంలో సంప్రదాయాలు పాటించడం లేక పోతున్నారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఉండడంవల్ల సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోవడం జరుగుతుంది కావున. వాటిని మరవకుండా ప్రస్తుతం టెక్నాలజీ వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో వివిధ రంగాలలోని ఉద్యోగాలలో కూడా రాణించాలని కోరారు. ఆ మహిళ ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు ఉంటాయి వాటిలో మహిళలు బ్యాంకుల ద్వారా వచ్చే రుణాలతో తక్కువ వడ్డీతో పరిశ్రమలు చిన్నచిన్న కుటీర వ్యాపారం ఏర్పాటు చేసుకొని మహిళలు కూడా అభివృద్ధి చెందాలని ప్రభుత్వములు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు మహిళ సాధికారం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ.. గద్వాల ఎమ్మెల్యే మహిళల పై ప్రత్యేక దృష్టి గురించి మహిళలు కూడా సమాజంలో అన్ని రంగాల్లో రాణించాలని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ స్టడీ మెటీరియల్ పంపిణీ డీఎస్సీ వంటి పోటీ పరీక్షలలో దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందడానికి మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రత్యేకంగా సొంత ఖర్చులతో గద్వాల ప్రాంతంలోని వారికి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థికంగా ఎదగాలని సమత సేవాసమితి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులకు సమాజంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి గతంలో మహిళలను ఇంటికి మాత్రమే పరిమితం చేయువారు కానీ నేటి ప్రస్తుతం మారుతున్న తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జరుగుతుంది. మహిళలకు సంబంధించిన గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించే విధంగా కృషి చేయాలని కోరారు. మహిళా భద్రత ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారికత లక్ష్యంగా ముందుకు వెళ్తు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించి, మహిళా రక్షణ ,సమగ్ర వికాసం, సంక్షేమం అభివృద్ధి కోసమే అనేక పథకాలు అమలు చేస్తూ మహిళలకు అడుగడుగునా అండగా ఉంటూ, మహిళా అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలను మహిళా దినోత్సవం రోజు మాత్రమే గౌరవించడం ప్రతిరోజు మహిళలను గౌరవించాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ఉద్యోగులు, మాజీ ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి నాయకులు, మహిళలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News