Monday, March 30, 2026

మానవ మనుగడకు మహిళలే పునాది

  • లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్
  • మహిళ కానిస్టేబుళ్లకు సన్మానం
  • ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న) : మానవ మనుగడకు మహిళలే పునాది,మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా కానిస్టేబుళ్లను సీఐ నరేందర్, ఎస్సై సతీష్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళ లేనిదే సమాజం లేదని, ఈ సమాజానికి వ్యవసాయం, పశుపోషణ, పనిముట్లు వాడకం నేర్పింది మహిళలేనన్నారు. నాగరికతకు పునాదులు వేసింది వారేనన్నారు. ఆదిమ మానవుని నుండి ఆధునిక మానవుడిగా ఎదగడానికి మహిళలు చేసిన కృషి వెల కట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News